ట్రంప్ సర్కార్ సంచలనం.. 1.75 లక్షల విదేశీ వీసాలు రద్దు!
- ట్రంప్ ప్రభుత్వ నిరంతర పరిశీలనలో భాగంగా చర్యలు
- నేర కార్యకలాపాలు, మోసాలు, జాతీయ భద్రత కారణాలుగా వెల్లడి
- బర్త్ టూరిజం ఆరోపణలపైనా వీసాల రద్దు
- వీసా అనేది హక్కు కాదు, ఒక అవకాశమేనన్న అమెరికా
అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత, చట్టాల ఉల్లంఘన వంటి కారణాలతో విదేశీయులకు జారీ చేసిన సుమారు 1,75,000కు పైగా వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన నిరంతర సమీక్ష ప్రక్రియలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ సోమవారం విడుదల చేసిన 'ఫ్యాక్ట్ షీట్'లో వెల్లడించింది.
నేరపూరిత కార్యకలాపాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన, మోసపూరిత వ్యవహారాలు, జాతీయ భద్రతకు విఘాతం కలిగించడం, అమెరికన్లపై హింసకు ప్రేరేపించడం వంటి కారణాలతో ఈ వీసాలను రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. దర్యాప్తు సంస్థలు అందించిన సమాచారం ప్రాతిపదికన అత్యధిక వీసాల రద్దు ప్రక్రియ చోటుచేసుకుంది. వీటిలో ప్రధానంగా డ్రైవింగ్ అండర్ ఇన్‌ఫ్లుయెన్స్ (DUI), దాడులు, చోరీలు, మాదకద్రవ్యాల విక్రయాలు వంటి నేరాలు ఉన్నాయి.
ఈ ఫ్యాక్ట్ షీట్‌లో మరికొన్ని తీవ్రమైన కేసులను సైతం ప్రస్తావించారు. అత్యాచారం, కిడ్నాపింగ్, మానవ అక్రమ రవాణా, చిన్నారులపై లైంగిక వేధింపులు వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారి వీసాలను తక్షణమే రద్దు చేశారు. అలాగే కేవలం తమ సంతానానికి అమెరికా పౌరసత్వం లభించేలా చూసేందుకు వచ్చే 'బర్త్ టూరిజం' బాధితుల వీసాలను కూడా రద్దు చేశారు. విదేశాంగ విధానాల దృష్ట్యా క్యూబా, ఇరాన్, లావోస్, కువైట్‌కు చెందిన పలువురి వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో వివరించారు.
"అమెరికా వీసా అనేది హక్కు కాదు, అది కేవలం ఒక విశేష అవకాశం మాత్రమే" అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేసే వారి నుంచి అమెరికా సమాజానికి రక్షణ కల్పించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వీసా కేవలం అమెరికా భూభాగంలోకి ప్రవేశించేందుకు ఇచ్చే అనుమతి పత్రం మాత్రమేనని, దేశంలోకి అనుమతించాలా లేదా అనే తుది నిర్ణయం ఇమ్మిగ్రేషన్ అధికారులకే ఉంటుందని స్పష్టం చేసింది.