Balakrishna: బాలయ్య సరసన ఛాన్స్ ఆమెకి దక్కిందట!

Priyamani in Balakrishna Movie
షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ తాజా చిత్రంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా శ్రుతిహాసన్ అలరించనుంది. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఆ తరువాత సినిమాను ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతూనే ఉంది. 

ఈ సినిమాలో బాలకృష్ణ 50 ఏళ్ల వయసుగల తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఆయన కూతురు పాత్రలో శ్రీలీల నటించనుంది. ఇక అనిల్ రావిపూడి 'ఎఫ్  2' .. 'రాజా ది గ్రేట్' .. ' ఎఫ్ 3' సినిమాలలో మెహ్రీన్ చేయడం వలన, ఈ సినిమాలోనూ మెహ్రీన్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రియమణి కనిపించనుందని తెలుస్తోంది. 

కథా పరంగా బాలయ్య వయసుకి తగిన నాయిక ఆమెనే అని తీసుకున్నారట. 'నారప్ప' సినిమాలో ఆమె నటన కూడా ఈ సినిమాలోకి తీసుకోవడానికి కారణమైందని అంటున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయనీ, బాలయ్యను ఇంతవరకూ ఎవరూ చూపించని విధంగా తాను చూపిస్తానని అనిల్ రావిపూడి చెప్పడంతో అందరిలో మరింత ఆసక్తి రేకెత్తుతోంది.
Go Back to Shorts
Balakrishna
Priyamani
Anil Ravipudi Movie

More Telugu News