నన్ను చంపడానికి కుట్ర.. ఓ వీడియో రికార్డు చేశాను.. నన్ను హత్య చేస్తే అది బయటపడుతుంది: ఇమ్రాన్ ఖాన్
- పాకిస్థాన్ తో పాటు విదేశాల్లో ఉన్న కొందరు కుట్రపన్నారన్న ఇమ్రాన్
- తాను కొందరికి వ్యతిరేకంగా ఉన్నట్లు కుట్రదారులు భావిస్తున్నారని వ్యాఖ్య
- వారి పేర్లను వీడియోలో రికార్డు చేశానని వివరణ
దీనిని ఓ సురక్షిత ప్రదేశంలో భద్రపరిచానని, ఒకవేళ తనను హత్య చేస్తే, ఆ వీడియో బయటపడుతుందని చెప్పుకొచ్చారు. తాను కొందరికి వ్యతిరేకంగా ఉన్నట్లు కుట్రదారులు భావిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తనపై కుట్ర పన్నుతోన్న వారి పేర్లను తాను ఓ వీడియోలో రికార్డు చేశానని అన్నారు. కాగా, పాకిస్థాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయిన అనంతరం ఇమ్రాన్ ఖాన్ పలు సార్లు ప్రత్యర్థి పార్టీల నేతలపై ఆరోపణలు గుప్పించారు.