రాణించిన రోహిత్, ఇషాన్, టిమ్ డేవిడ్... ముంబయి భారీ స్కోరు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
- బ్యాటింగ్ కు దిగిన ముంబయి
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 రన్స్
- శుభారంభం అందించిన ఇషాన్, రోహిత్
- ధాటిగా ఆడిన టిమ్ డేవిడ్
సూర్యకుమార్ యాదవ్ (13), కీరన్ పొలార్డ్ (4) విఫలమయ్యారు. తిలక్ వర్మ (21) మరోసారి ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే దురదృష్టవశాత్తు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, అల్జారీ జోసెఫ్ 1, ప్రదీప్ సాంగ్వాన్ 1, లాకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు.