తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా కూర్చున్న బాలుడిని ఎత్తుకెళ్లిన మహిళ
- బాలుడి కిడ్నాప్‌పై అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు
- కిడ్నాప్ చేసిన మహిళ ఏపీ03 జడ్ 0300 నంబరు ఆర్టీసీ బస్సు ఎక్కిందని గుర్తింపు
- కిడ్నాప్‌కు గురైన బాలుడి పేరు గోవర్ధన్ రాయల్ అని తెలిపిన పోలీసులు
బాలుడిని ఎత్తుకెళ్లిన మహిళ తిరుపతికి వెళ్లే ఏపీ03 జడ్ 0300 నంబరు ఆర్టీసీ బస్సు ఎక్కిందని పోలీసులు చెప్పారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా మహిళను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన బాలుడి పేరు గోవర్ధన్ రాయల్ అని, ఆ బాలుడి కుటుంబం తిరుపతి దామినీడలో నివసిస్తోందని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.