Talasani: ఏపీ మంత్రుల‌కు ఎందుకంత ఉలికిపాటు: తెలంగాణ మంత్రి త‌ల‌సాని

talasni srinivas yadav comments on ap ministers
షార్ట్స్‌లో చూడండి
పొరుగు రాష్ట్రంలో మౌలిక స‌దుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చినా... ఈ వ్యాఖ్య‌ల‌పై ఇంకా రాద్ధాంతం జ‌రుగుతూనే ఉంది. శుక్ర‌వారం కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌గా, వాటిపై ఏపీ మంత్రులు శుక్ర‌వార‌మే వ‌రుస‌గా విరుచుకుప‌డ్డారు. తాజాగా శ‌నివారం మీడియాతో మాట్లాడిన తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఏపీ మంత్రుల స్పంద‌న‌ల‌పై ప్ర‌తిస్పందించారు. 

ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రుల‌కు ఎందుకంత ఉలికిపాటు అని ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్‌లో క‌రెంట్ లేకుంటే ఇక్క‌డెలా శుభ‌కార్యాలు చేసుకున్నారంటూ ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను ఉద్దేశించి త‌ల‌సాని వ్యాఖ్యానించారు. క‌రోనా చికిత్స‌ల‌ను ఎవ‌రు ఎక్క‌డ చేయించుకున్నారో అంద‌రికీ తెలుసున‌ని ఆయ‌న అన్నారు. ఏపీ నేత‌లు ఎందుకంత తొంద‌ర‌ప‌డుతున్నారో అర్థం కావ‌డం లేద‌న్న త‌ల‌సాని... హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న అభివృద్ధినే కేటీఆర్ చెప్పార‌ని తెలిపారు.
Go Back to Shorts
Talasani
KTR
TRS
AP Ministers

More Telugu News