అమెరికాలో తెలంగాణ టెక్కీ హఠాన్మరణం
- అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
- గద్వాల వాసి సునీల్ కుమార్ (51) గుండెపోటుతో మరణం
- ఫ్లోరిడాలోని టాంపాలో తన ఇంటి ఆవరణలోనే కుప్పకూలిన టెక్కీ
- మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన సునీల్
- సునీల్ కు భార్య, ఇద్దరు కుమారులు
అమెరికాలోని తెలుగు సమాజంలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. గద్వాల పట్టణానికి చెందిన జి. సునీల్ కుమార్ (51) ఫ్లోరిడాలోని టాంపా నగరంలో నివసిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన తన నివాసం ఆవరణలోనే ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది.
వివరాల్లోకి వెళితే, సునీల్ కుమార్ ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్లపాటు చెన్నైలో పనిచేసిన ఆయన, మెరుగైన అవకాశాల కోసం మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. ఇటీవలే ఆయన మరో కంపెనీకి మారినట్లు ఆయన చిన్ననాటి స్నేహితులు తెలిపారు.
సునీల్ కుమార్ హఠాన్మరణ వార్త తెలియగానే గద్వాలలోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. అమెరికాలోని ఆయన స్నేహితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.