విండోస్ 11 ఉచిత అప్ గ్రేడ్ తీసుకువచ్చిన మైక్రోసాఫ్ట్.. ఫీచర్లు ఇవే!

Microsoft Windows 11 Free Upgrade Features
  • విండోస్ 11 కోసం కొత్త టెస్టింగ్ అప్ డేట్లు విడుదల
  • ఫైల్ ఎక్స్‌ప్లోరర్, టచ్‌ప్యాడ్‌లో కీలక మెరుగుదలలు
  • విద్యాసంస్థలకు విండోస్ 11 ప్రొ ఎడ్యుకేషన్‌కు ఉచిత అప్‌గ్రేడ్
  • ప్రస్తుతం ఇన్‌సైడర్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో
మైక్రోసాఫ్ట్ తన విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌కు పలు కొత్త ఫీచర్లను జోడిస్తూ లేటెస్ట్ అప్‌డేట్‌లను విడుదల చేసింది. విండోస్ ఇన్‌సైడర్ ప్రోగ్రామ్‌లోని బీటా, ఎక్స్‌పెరిమెంటల్ ఛానల్ యూజర్ల కోసం ఈ కొత్త అప్ డేట్లను అందుబాటులోకి తెచ్చింది. ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ముఖ్యమైన మెరుగుదలలు, టచ్‌ప్యాడ్‌కు కొత్త జెస్చర్లు, విద్యాసంస్థలకు ఉచిత అప్‌గ్రేడ్ వంటి కీలక మార్పులను ఈ అప్‌డేట్‌లో భాగంగా పరిచయం చేసింది.

ఈ అప్‌డేట్‌లో భాగంగా ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌ను మరింత మెరుగుపరిచారు. ఇప్పటివరకు ఫైల్ సైజులు కేవలం KBలలో మాత్రమే కనిపించేవి. ఇకపై ఫైల్ పరిమాణాన్ని బట్టి MB, GBలలో కూడా స్పష్టంగా కనిపిస్తాయి. దీంతోపాటు అడ్రస్ బార్‌లో క్లిష్టమైన పాత్‌లను సులభంగా గుర్తించడం, ఫైల్స్ రీనేమ్ చేసేటప్పుడు తలెత్తే సమస్యలను పరిష్కరించారు.

ల్యాప్‌టాప్ యూజర్ల కోసం ప్రెసిషన్ టచ్‌ప్యాడ్‌లకు కొత్త సామర్థ్యాలను జోడించారు. దీని ద్వారా టచ్‌ప్యాడ్ స్క్రోలింగ్, జూమ్ వేగాన్ని నియంత్రించుకోవచ్చు. అలాగే, పదేపదే స్క్రోల్ చేస్తే వేగం పెరిగేలా 'యాక్సిలరేటెడ్ స్క్రోలింగ్' ఫీచర్‌ను కూడా అందించారు.

ఈ అప్‌డేట్‌లో విద్యాసంస్థలకు (K-12) మైక్రోసాఫ్ట్ ఒక శుభవార్త చెప్పింది. విండోస్ 11 హోమ్ ఎడిషన్ ఉన్న డివైజ్‌లను ఎలాంటి ఖర్చు లేకుండా విండోస్ 11 ప్రొ ఎడ్యుకేషన్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే, ఇది వన్-వే అప్‌గ్రేడ్ మాత్రమేనని, తిరిగి హోమ్ ఎడిషన్‌కు మారాలంటే క్లీన్ ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉండగా, త్వరలోనే సాధారణ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Go Back to Shorts
Microsoft
Windows 11
Windows 11 update
File Explorer
Touchpad gestures
Windows 11 Pro Education
K-12 education
Operating system
Software update

More Telugu News