Jignesh Mevani: లేడీ కానిస్టేబుల్ పై దాడి కేసులో జిగ్నేష్ మేవానీకి బెయిల్

Gujarat MLA JIgnesh Mevani gets bail in another case
షార్ట్స్‌లో చూడండి
గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి మరో కేసులోనూ బెయిల్ లభించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అసోం కోక్రాఝార్ పోలీసులు జిగ్నేష్ మేవానీని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోక్రాఝార్ కోర్టు మేవానీకి బెయిల్ ఇచ్చింది. 

అయితే ఆయనను పోలీసులు ఓ మహిళా కానిస్టేబుల్ పై దాడి చేశాడన్న ఆరోపణలతో మరో కేసులో అరెస్ట్ చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై దాడి చేశాడని అభియోగాలు మోపారు. ఇప్పుడు ఈ కేసులో జిగ్నేష్ మేవానీ బెయిల్ పొందారు.
Go Back to Shorts
Jignesh Mevani
Bail
Lady Constable
Assault
Assam
Gujarat

More Telugu News