తనను ప్రేమించాలంటూ విద్యార్థిని గొంతు కోసిన యువకుడు
- హనుమకొండలోని గోపాలపూర్‌లో కలకలం
- ఎంసీఏ విద్యార్థిని (23) వెంటపడుతున్న అజహర్
- ఈ రోజు ఆమె ఇంటికి వెళ్లి దాడి
- బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
బాధితురాలు కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతోందని ఆమె కుటుంబీకులు మీడియాకు చెప్పారు. కొంత కాలంగా ప్రేమ పేరుతో ఆ విద్యార్థినిని అజహర్ వేధిస్తున్నాడని, అతడిని ఆమె నిరాకరిస్తుండడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలపై ఆరా తీస్తున్నారు.