ఆత్మహత్య ఆలోచనలపై వివరణ ఇచ్చిన ఇలియానా
- ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఇలియానా
- డిప్రెషన్ కు లోనయ్యానని వెల్లడి
- ఆత్మహత్య ఆలోచన చేసినట్టు వివరణ
- మీడియాలో మరోరకంగా రాశారని ఆవేదన
బాడీ షేమింగ్, బాడీ డిస్మోర్ఫిక్ సమస్యలతో తాను బాధపడ్డానని తెలిపింది. పన్నెండేళ్ల వయసు నుంచే తాను శారీరక సమస్యలతో బాధపడడంతో, ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ననని వివరించింది. కెరీర్ లో ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అయితే అందుకు బాడీ షేమింగ్ అంశం కారణం కాదని స్పష్టం చేసింది. ఇతర కారణాల వల్ల అప్పట్లో తాను మానసికంగా కుంగిపోయానని తెలిపింది. అది ఎంతో సున్నితమైన అంశం కావడంతో చనిపోవాలన్న నిర్ణయం తీసుకున్నానని వివరించింది. తన జీవితంలో అదొక బలహీన దశ అని పేర్కొంది.
కానీ మీడియాలో మాత్రం బాడీ షేమింగ్, బాడీ డిస్మోర్ఫిక్ అంశాలతోనే ఆత్మహత్య ఆలోచన చేసినట్టు రాశారని ఇలియానా తెలిపింది. ఆ కథనం ఎవరు రాశారో తెలియదు కానీ, ఆ కథనం చూసి అనేకమంది తనకు సందేశాలు పంపడం ప్రారంభించారని వెల్లడించింది. దాంతో తనకు చాలా చిరాకు కలిగిందని పేర్కొంది.
ఇలియానా ప్రస్తుతం రణదీప్ హుడా సరసన ఓ చిత్రం చేస్తోంది. అంతేకాదు, శిరీషా గుహా థాకూర్తా దర్శకత్వంలో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీలతో కలిసి మరో చిత్రంలోనూ నటిస్తోంది.