తెలంగాణలో కొత్తగా 24 కరోనా కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!

Telangana corona report
  • గత 24 గంటల్లో 15,561 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 9 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 25 మంది
  • ఇంకా 213 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 15,561 కరోనా పరీక్షలు నిర్వహించగా, 24 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 9 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 6, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3, వరంగల్ రూరల్ జిల్లాలో 1, హనుమకొండ జిల్లాలో 1, నాగర్ కర్నూలు జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1, ఖమ్మం జిల్లాలో 1, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1 కేసు వెల్లడయ్యాయి. 

అదే సమయంలో 25 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,522 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,198 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 213 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Report
Updates
Today Cases

More Telugu News