SRH: ఐపీఎల్: గుజరాత్ పై టాస్ నెగ్గిన సన్ రైజర్స్

Sunrisers won the toss and elected bowling
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబయిలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ నెగ్గిన సన్ రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లోనూ ఇదే పంథాలో లక్ష్యఛేదన చేసిన సన్ రైజర్స్ మరోసారి అదే వ్యూహానికి కట్టుబడ్డారు. 

మరి ఈ టోర్నీలో ఓటమి ఎరుగని గుజరాత్ తో మ్యాచ్ లో ఏంచేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ జట్టులో ఎలాంటి మార్పుల్లేవు. అటు, గుజరాత్ టైటాన్స్ కూడా అదే జట్టుతో బరిలో దిగుతున్నట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.
Go Back to Shorts
SRH
Toss
Gujarat Titans
IPL

More Telugu News