తెలంగాణలో తాజాగా 29 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona updates and daily bulletin
  • గత 24 గంటల్లో 16,388 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 17 కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 32 మంది
  • ఇంకా 249 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 16,388 కరోనా పరీక్షలు నిర్వహించగా, 29 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదు జిల్లాలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 32 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,426 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,066 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 249 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మరణించారు. మరణాల రేటు 0.51 శాతానికి పడిపోగా, రికవరీ రేటు 99.44 శాతంగా నమోదైంది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Updates
Today Cases

More Telugu News