KKR: ముంబైతో మ్యాచ్‌లో కేకేఆర్ టార్గెట్ 162 ప‌రుగులు

mumbai fix 162 target to kkr
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో భాగంగా బుధ‌వారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. పూణే వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్‌ను ఎంచుకుని ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 

కేకేఆర్ ఆహ్వానంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై.. ఓ మోస్త‌రు స్కోరుకే ప‌రిమిత‌మైంది. 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి ముంబై 161 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ 52 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. తిల‌క్ వ‌ర్మ (38), దెవాల్డ్ బ్రెవిస్ (28), కీర‌న్ పొలార్డ్ (22) ప‌రుగులతో రాణించారు. ముంబై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (3) మ‌రోమారు నిరాశ ప‌రిచాడు. కాసేప‌ట్లో బ్యాటింగ్‌కు దిగ‌నున్న కేకేఆర్ 162 ప‌రుగులే ల‌క్ష్యంగా సాగ‌నుంది.
Go Back to Shorts
KKR
Mumbai Indians
IPL 2022

More Telugu News