Sunrisers Hyderabad: కేఎల్ రాహుల్, దీపక్ హుడా ఫిఫ్టీలు.. సన్ రైజర్స్ టార్గెట్ 170 రన్స్

LSG set Sunrisers reasonable target
షార్ట్స్‌లో చూడండి
ముంబయిలో లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు 170 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాట్స్ మన్ దీపక్ హుడా అర్ధసెంచరీలు నమోదు చేశారు. 

ఓపెనర్ గా వచ్చిన రాహుల్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 68 పరుగులు చేయగా, వేగంగా ఆడిన దీపక్ హుడా 33 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 51 పరుగులు సాధించాడు. యువ బ్యాట్స్ మన్ ఆయుష్ బదోని 12 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు. 

అంతకుముందు, ఓపెనర్ క్వింటన్ డికాక్ 1, ఎవిన్ లూయిస్ 1 పరుగుకే అవుటై నిరాశపరిచారు. మనీష్ పాండే 11, కృనాల్ పాండ్య 6, జాసన్ హోల్డర్ 8 (నాటౌట్) పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, నటరాజన్ తలో రెండు వికెట్లు తీశారు.
Go Back to Shorts
Sunrisers Hyderabad
Lucknow Supergiants
Target
IPL

More Telugu News