Andhra Pradesh: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. గ్రూప్ 1, 2 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కారు అనుమతి

ap government issues green signal to fillup 292 posts
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు గురువారం నాడు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భ‌ర్తీలో భాగంగా గ్రూప్ 1, 2ల కింద మొత్తం 292 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు ఈ ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి మంజూరు చేసింది.

ప్ర‌భుత్వం అనుమతి మంజూరు చేసిన ఉద్యోగాలు మొత్తం 292 కాగా.. వీటిలో గ్రూప్ 1 కింద 110 ఉద్యోగాలు, గ్రూప్ 2 కింద 182 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భ‌ర్తీ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి ల‌భించిన నేప‌థ్యంలో ఏపీపీఎస్సీ ఏ క్షణంలోనైనా గ్రూప్ 1,2 నోటిఫికేష‌న్ల‌ను జారీ చేయ‌నుంది.
Go Back to Shorts
Andhra Pradesh
Group 1
Group 2
APPSC

More Telugu News