విజయ్ దేవరకొండ జోడీగా జాన్వీ కపూర్!
- పూరి నుంచి 'జన గణ మన'
- హీరోగా విజయ్ దేవరకొండ
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
- వచ్చే ఆగస్టులో విడుదల
'లైగర్' సినిమాలో కథానాయిక పాత్ర కోసం జాన్వీని తీసుకుందామని పూరి గట్టిగానే ప్రయత్నించాడుగానీ కుదరలేదు. ఆ తరువాత కాస్త ఆలస్యంగా ఈ ప్రాజెక్టులోకి కరణ్ జొహార్ రావడం వలన, జాన్వీని తీసుకోవడం కుదరలేదు. లేదంటే జాన్వీని ఆయన ఒప్పించేవారే. ఎందుకంటే శ్రీదేవి ఫ్యామిలీతో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉంది.
జాన్వీ కపూర్ ఫస్టు సినిమా 'ధడక్'ను నిర్మించింది ఆయనే. ఇప్పటికీ తన సినిమాల్లో ఆయన తొలి ప్రాధాన్యతను జాన్వీకే ఇస్తారు. ఆయన చెప్పడం వల్లనే, విజయ్ దేవరకొండతో పూరి చేయనున్న 'జన గణ మన' సినిమాకి జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి ఉంది.