Vijayasai Reddy: అర్థం పర్థంలేని నీ కామెడీ చూసి జనం నవ్వుకుంటున్నారు: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai slams tdp
షార్ట్స్‌లో చూడండి
వైసీపీపై టీడీపీ నేత నారా లోకేశ్ చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి ప‌రోక్షంగా కౌంట‌ర్ ఇచ్చారు. విశాఖ ప్ర‌జ‌లు త‌మ పార్టీ వైపే ఉన్నారంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. 

'అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు ఓటేశామా అని బాధపడుతూ ఇప్పుడు జగన్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు విశాఖ వాసులు. వైజాగ్ కార్పొరేషన్ సహా ఉత్తరాంధ్ర మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూడలేదా పప్పు నాయుడూ? అర్థం పర్థంలేని నీ కామెడీ చూసి జనం నవ్వుకుంటున్నారు' అని విజ‌యసాయిరెడ్డి అన్నారు. 

కాగా, ఏపీ సీఎం జ‌గ‌న్ ఎంత త్వ‌ర‌గా విశాఖ‌ప‌ట్నంలో కూర్చొని పాలిస్తే ఉత్త‌రాంధ్ర‌లో త‌మ పార్టీకి అన్ని ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌ని నిన్న లోకేశ్ అన్నారు. విజ‌య‌సాయిరెడ్డి వ‌ల్ల విశాఖ‌లో అరాచ‌కాలు, భూ క‌బ్జాలు పెరిగాయ‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ నేప‌థ్యంలోనే విజ‌య‌సాయిరెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు.
Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Telugudesam

More Telugu News