ఉమెన్స్ డే స్పెషల్.. గుర్రంపై మహిళా ఎమ్మెల్యే!
- గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి రాక
- ఝార్ఖండ్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ వినూత్నత
- కూతుళ్లకు మంచి విద్య అందించాలని తల్లిదండ్రులకు పిలుపు
ఝార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే అంబా ప్రసాద్ మంగళవారం గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా తనను పలుకరించిన మీడియాతో ఆమె మాట్లాడుతూ... ప్రతి మహిళలోనూ దుర్గా, జాన్సీరాణీ ఉన్నారన్నారు. ధైర్యంతో మహిళలు ప్రతి సవాల్‌ను ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారని, తల్లిదండ్రులు తమ కూతుళ్లకు మంచి విద్యను అందించాలని కోరారు.