హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్
- తెలంగాణకు వరుసగా పెట్టుబడులు
- కేటీఆర్ సమక్షంలో జరిగిన ఒప్పందం
- హైదరాబాద్‌లో రూ.15 వేల కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటు
- ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేసిన మంత్రి
ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేస్తూ కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఆ సంస్థకు సంబంధించి అతిపెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది. ఈ డేటా సెంటర్ కోసం మైక్రోసాఫ్ట్ ఏకంగా రూ.15 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.