తెలంగాణలో 151 మందికి కరోనా పాజిటివ్... తాజా బులెటిన్ ఇదిగో!

Telangana Corona Positive cases declines
  • గత 24 గంటల్లో 18,881 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు
  • ఇంకా 3,237 మందికి చికిత్స
గడచిన 24 గంటల్లో తెలంగాణలో 18,881 కరోనా పరీక్షలు నిర్వహించగా, 151 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 68 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధిక జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే తాజా కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 453 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,88,775 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,81,427 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,237 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Positive Cases
Daily Update
Today Cases

More Telugu News