బాలీవుడ్ కి భారీస్థాయిలో వెళుతున్న 'ఆచార్య'?
- కొరటాల రూపొందించిన 'ఆచార్య'
- నక్సలైట్ల పాత్రల్లో చిరూ .. చరణ్
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- ఏప్రిల్ 29వ తేదీన విడుదల
బాలీవుడ్లో భారీస్థాయిలో ఈ సినిమాను వదలాలనే దిశగానే సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అవినీతి పరులైన భూస్వాముల పెత్తందారీతననానికి వ్యతిరేకంగా పోరాడే నక్సలైట్ల పాత్రల్లో చిరంజీవి - చరణ్ కనిపించనున్నారు. చిరూ సరసన కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనుంది.
నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఆయన నుంచి వదిలిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోనూ సూద్ .. సంగీత .. పోసాని .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, రెజీనా ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
.