Jagapathi Babu: జగపతిబాబు ఇంటికెళ్లిన మంత్రి ఎర్రబెల్లి.. తన చిరకాల మిత్రుడని వ్యాఖ్య!
- ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జగపతిబాబు
- ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి
- జగపతిబాబుకు ఇంకా ఎంతో పేరు రావాలని ఆకాంక్ష
ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జగపతిబాబు బర్త్ డే సందర్భంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హీరోగా, విలన్ గా అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను జగపతిబాబు సంపాదించుకున్నారని చెప్పారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జగపతిబాబుకు ఇంకా ఎంతో పేరు రావాలని, అవార్డులు, రివార్డులు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. జగపతి తనకు చిరకాల మిత్రుడని చెప్పారు.