RRR: 'ఆర్ఆర్ఆర్' టీమ్ లో కొత్త కలవరం.. భయపెడుతున్న రెండు అంశాలు!

Exams and IPL worrying RRR release
షార్ట్స్‌లో చూడండి
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ సైతం ఈ చిత్రం కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు తొలి నుంచి కూడా ఈ చిత్రానికి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. తాజాగా మరో సమస్య ఈ చిత్రాన్ని వేధిస్తోంది. పలు కారణాల వల్ల ఇప్పటి వరకు విడుదల వాయిదా పడిన ఈ చిత్రం... మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక్కడే ఈ చిత్ర దర్శకనిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

మార్చి నెల అంటే పరీక్షల సీజన్. విద్యార్థులందరూ పరీక్షల ప్రిపరేషన్ లో ఉంటారు. దీంతో ఈ సమయంలో ఎక్కువగా సినిమాలు విడుదల కావు. మరోవైపు మార్చి చివరి వారంలో కానీ లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ లో ఈసారి 10 జట్లు పాల్గొంటున్నాయి. దీంతో, ఈ టోర్నీ సుదీర్ఘంగా కొనసాగనుంది. ఓ వైపు పరీక్షలు, మరోవైపు ఐపీఎల్... తమ చిత్రంపై ప్రభావం చూపే అవకాశమున్నాయని కలవరపడుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఏం జరగబోతోందో వేచి చూడాలి.
Go Back to Shorts
RRR
Release
Exams
IPL

More Telugu News