చిరు వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్లాల్సిన అవసరం లేదు: అల్లు అరవింద్
- నేడు సీఎం జగన్ తో చిత్ర ప్రముఖుల భేటీ
- తమ కుటుంబం నుంచి చిరంజీవి వెళుతున్నారన్న అరవింద్
- వివాదాలకు నేటితో తెరపడుతుందని ఆకాంక్ష
అయితే, తాను వెళ్తున్నది ఏపీకి కాదని, మరో పనిపై చెన్నైకి వెళ్తున్నానని అల్లు అరవింద్ చెప్పారు. 'నేటితో సినిమా టికెట్ల వివాదానికి తెరపడుతుందని భావిస్తున్నాను. అందరికీ మంచి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నాను. ఏపీ సీఎం జగన్ వద్దకు మా కుటుంబం నుంచి చిరంజీవి గారు వెళ్తున్నారు.. కనుక నేను వెళ్లాల్సిన అవసరం లేదు' అని అల్లు అరవింద్ చెప్పారు.