revanth: గుంటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్న సింగ‌ర్ రేవంత్.. ఫొటోలు ఇవిగో

revanth gets married
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ గాయకుడు, ఇండియన్‌ ఐడిల్‌-9 విజేత రేవంత్ కు గుటూరుకు చెందిన అన్విత అనే అమ్మాయితో పెళ్లి జ‌రిగింది. అన్విత‌ మెడ‌లో రేవంత్  మూడు ముళ్లు వేసిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

కరోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఈ పెళ్లి వేడుక‌ను కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే గుంటూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరుపుకున్నాడు. పలువురు గాయనీగాయకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. రేవంత్, అన్వితల నిశ్చితార్థం డిసెంబర్‌ 24న జరిగింది. ప‌లువురు సినీ ప్రముఖులు రేవంత్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. త‌న పెళ్లి ఫొటోల‌ను రేవంత్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

             
 
Go Back to Shorts
revanth
marriage
Tollywood

More Telugu News