Andhra Pradesh: ఏపీలో కొత్తగా 6,213 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Daily Statistics
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 35,035 కరోనా పరీక్షలు నిర్వహించగా... 6,213 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 830, తూర్పు గోదావరి జిల్లాలో 731 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 10,795 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,82,583 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,62,033 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,05,930 మందికి చికిత్స జరుగుతోంది. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,620కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Daily Statistics
Today Cases

More Telugu News