వేకువ జామున 3 నుంచి 4 గంటల దాకా పిల్లలకు హోం వర్క్ చేయించేదాన్ని: ప్రియాంక గాంధీ
- ఫేస్ బుక్ లైవ్ లో యూజర్లతో సరదా వ్యాఖ్యలు
- తన పిల్లలతో పాటు వారి ఫ్రెండ్స్ హోం వర్క్ కూ సాయం చేసేదాన్ని
- చిన్నప్పుడు రాహుల్ తో బాగా ఫైటింగ్ చేసేదాన్నన్న ప్రియాంక
కొన్నికొన్నిసార్లు ఎన్నికల ప్రచారం నుంచి ఆలస్యంగా వస్తే.. వేకువజామున 3 నుంచి 4 గంటల వరకూ పిల్లలతో హోం వర్క్ చేయించేదానినని తెలిపారు. తన చిన్నప్పుడు తన అన్న రాహుల్ గాంధీతో తీవ్రంగా పోట్లాడేదాన్నని గుర్తు చేసుకున్నారు. తమ ఇంట్లో నిర్ణయాలు తీసుకోవడం విషయంలో భయంకరమైన ప్రజాస్వామ్యవాదం ఉండేదన్నారు.