సింగీతంకు కన్నీటి వీడ్కోలు.. చెన్నైలో ముగిసిన అంత్యక్రియలు
- నిన్న కన్నుమూసిన సింగీతం శ్రీనివాసరావు
- నేడు చెన్నై నేసపాక్కం శ్మశానవాటికలో అంత్యక్రియలు
- అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర
- సినీ యవనికపై ముగిసిన ఓ మహోన్నత అధ్యాయం
భారతీయ సినీ యవనికపై తనదైన ముద్ర వేసిన విలక్షణ దర్శకుడు, లెజెండరీ ఫిలింమేకర్ సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలో ఆదివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు చెన్నైలోని నేసపాక్కం శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ ప్రముఖుల అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. భారతీయ సినిమాకు దశాబ్దాల పాటు విశేష సేవలందించిన ఓ మహోన్నత అధ్యాయం ఆయన మరణంతో ముగిసినట్లయింది.
వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సింగీతం శ్రీనివాసరావు (94), చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన భౌతికకాయాన్ని చెన్నై విరుగంబాక్కంలోని ఆయన నివాసానికి తరలించారు. ఆదివారం ఉదయం నుంచి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు.
సింగీతంతో ఎన్నో చారిత్రక చిత్రాల్లో పనిచేసిన విశ్వనటుడు కమల్ హాసన్, ఆయన నివాసానికి చేరుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సింగీతం కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సింగీతం మరణం పట్ల భారతీయ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి ఎందరో అగ్ర తారలు, సాంకేతిక నిపుణులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. భారతీయ సినిమాలో ప్రయోగాలకు, నూతన ఒరవడులకు సింగీతం శ్రీకారం చుట్టారని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని కొనియాడారు.