విజయవాడలో... నిజామాబాద్ కు చెందిన ఒకే కుటుంబంలోని న‌లుగురి ఆత్మ‌హ‌త్య

family commits suicide
  • విజ‌య‌వాడ‌కు వెళ్లిన‌ నిజామాబాద్ వాసి పప్పుల సురేశ్ కుటుంబం
  • సత్రంలోని గ‌దిలో భార్య, కుమారుడు ఆత్మ‌హ‌త్య‌
  • కృష్ణా న‌దిలో దూకి సురేశ్, మ‌రో కుమారుడి మృతి
  • అప్పుల బాధ భ‌రించ‌లేకే ఆత్మ‌హ‌త్య‌
తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి ఒకే కుటుంబంలోని న‌లుగురు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన పప్పుల సురేశ్ అనే వ్య‌క్తి కుటుంబం బెజ‌వాడ‌ దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. వన్‌టౌన్‌లోని కన్యకా పరమేశ్వరి సత్రంలో ఆ కుటుంబం ఓ రూమ్‌ను అద్దెకు తీసుకుంది. అయితే, తాము అప్పుల బాధ‌ను భ‌రించ‌లేక‌పోతున్నామంటూ ఈ రోజు తెల్లవారుజామున 2.30 గంటలకు ఆ కుటుంబం తమ బంధువుకు మెసేజ్ చేసింది.

దీంతో, ఆ బంధువు సత్రం నిర్వాహకులకు ఫోన్ చేసి ఆ విష‌యం తెలిపాడు. స‌త్రం నిర్వాహకులు రూమ్‌కు వెళ్లి చూడగా తల్లి, కుమారుడు అప్ప‌టికే మృతి చెందారు. వారు నిద్ర‌మాత్ర‌లు మింగి మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు, ఆ కుటుంబంలోని తండ్రి, మరో కుమారుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను పప్పుల సురేశ్‌(56), అత‌డి భార్య శ్రీలత(54), అఖిల్‌(28), ఆశిష్‌(22)గా పోలీసులు గుర్తించారు.
Go Back to Shorts
family
Crime News
Vijayawada
Telangana
Andhra Pradesh

More Telugu News