'లైగర్' కాంబో మరోసారి రిపీట్ అవుతుందట!

Liger movie update
  • ముగింపు దశలో 'లైగర్'
  • బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ
  • ఆగస్టు 25వ తేదీన విడుదల
  • మరో సినిమా చేసే ఛాన్స్
టాలీవుడ్లో మాస్ ఇమేజ్ కోరుకునే హీరోలెవరైనా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేసినా, తమ ముచ్చట తీరుతుందని భావిస్తారు. ఇక ఆల్రెడీ మాస్ ఇమేజ్ ఉన్నవాళ్లు పూరి సినిమాలో చేస్తే ఆ ఇమేజ్ మరింత పెరగడం ఖాయమనే విషయం కొంతమంది హీరోల విషయంలో నిజమైంది. అదే విషయాన్ని 'లైగర్' ఇప్పుడు మరోసారి నిరూపించబోతోంది.

పూరి - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్టుపై ఉండటం వలన ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట. పూరి టేకింగ్ పై విజయ్ కి అవగాహన పెరిగితే, విజయ్ లో తాను చూపించవలసిన మాస్ హీరోయిజం మరింత ఉందని పూరి భావిస్తున్నాడట.

అందువలన ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. 'లైగర్'ను ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తరువాత శివ నిర్వాణ సినిమాను పూర్తి చేసి, మళ్లీ పూరితో కలిసి విజయ్ దేవరకొండ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Go Back to Shorts
Vijay Devarakonda
Puri Jagannadh
Liger Movie

More Telugu News