తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయికుమార్.. సినిమా టికెట్ల వివాదంపై స్పందన
- స్వామివారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి, కంగనా రనౌత్
- టికెట్లు అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలన్న సాయికుమార్
- ఈ ఏడాది పలు సినిమాల్లో నటిస్తున్నట్టు వెల్లడి
ఈ ఏడాది తాను పలు భాషల చిత్రాల్లో నటిస్తున్నట్టు చెప్పిన ఆయన.. ఏపీలో కొనసాగుతున్న సినిమా టికెట్ల వివాదంపై స్పందించారు. టికెట్ల ధర నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ వేసిందని, వర్చువల్‌గా సమావేశం కూడా జరిగిందని పేర్కొన్నారు. టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండాలన్న సాయికుమార్.. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కాగా, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.