రేవంత్ రెడ్డి మరోసారి హౌస్ అరెస్ట్
- జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ గృహ నిర్బంధం
- పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు
- భూపాలపల్లి రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న వైనం
ఇటీవలే కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న రేవంత్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆరోజు ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసులకు, వారికి మధ్య తోపులాట కూడా జరిగింది. ఆ తర్వాత రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.