ఊళ్లోకి వచ్చిన చిరుతను చూసి అరిచిన శునకం.. గేటు దూకి లోపలికొచ్చి దానిని పట్టుకెళ్లిన చిరుత.. వీడియో వైరల్
- వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి
- కొండ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు మామూలేనన్న పర్వీన్ కాశ్వాన్
- క్రూర మృగాల బారినపడకుండా మెడకు ఇనుప కాలర్ చుట్టాలని సూచన
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. కొండ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయని ఆయన పేర్కొన్నారు. వీటిని నివారించాలంటే పెంపుడు జంతువుల మెడకు ఇనుప కాలర్ చుట్టాలని, ఇవి క్రూరమృగాల నుంచి వాటిని రక్షిస్తాయని అన్నారు. అలాంటి ఫొటోను కూడా ఆయన ట్విట్టర్‌లో పంచుకున్నారు.