దేశంలో మ‌రిన్ని పెరిగిన ఒమిక్రాన్ కేసులు

corona bulletin in inida
  • దేశంలో కొత్త‌గా 6,531 క‌రోనా కేసులు
  • నిన్న‌ 7,141 మంది డిశ్చార్జి
  • ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 578
  • ఏపీలో మొత్తం ఆరుగురికి ఒమిక్రాన్
  • తెలంగాణలో 41 మందికి
దేశంలో కొత్త‌గా 6,531 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 7,141 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య‌ 75,841గా ఉంది. రిక‌వ‌రీ రేటు 98.40 శాతం ఉంది.

ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కు పెరిగింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ఒమిక్రాన్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 151 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం ఆరుగురికి ఒమిక్రాన్ సోక‌గా ఒక‌రు కోలుకున్నారు. తెలంగాణలో ఒమిక్రాన్ 41 మందికి సోక‌గా, 10 మంది చికిత్స అనంత‌రం కోలుకున్నారు.

       
Go Back to Shorts
Omicron
Corona Virus
COVID19
India

More Telugu News