BSNL: 84 రోజుల పాటు రోజుకు 5జీబీ డేటా... బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్

BSNL new offer for prepaid users
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ కోసం రూ.599 చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా 84 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అదే సమయంలో రోజుకు 5జీబీ డేటా కూడా లభిస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్ లతో పాటు జింగ్ మ్యూజిక్ కూడా ఫ్రీ. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ లిమిటెడ్ డేటా పొందవచ్చు. ఇటీవల ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు ప్లాన్ల ధరలు పెంచిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన తాజా ఆఫర్ కు యూజర్ల నుంచి విశేష స్పందన వస్తుందని భావిస్తున్నారు.
Go Back to Shorts
BSNL
New Offer
Prepaid
Rs.599
India

More Telugu News