టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయోజనాల కోసమే సింగరేణి కార్మికుల సమ్మె: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
- తెలంగాణలో కోల్ బ్లాకుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది
- రాష్ట్రాలకు బొగ్గు గనులు కేటాయించలేం
- సింగరేణి కార్మికుల సమ్మె దురదృష్టకరం
యూపీఏ హయాంలో బొగ్గు గనులపై సుప్రీంకోర్టు చెప్పిన అంశాలు మనందరికీ తెలుసని... గతంలో రాష్ట్రాలకు బొగ్గు గనులను కేటాయించి ఉండొచ్చని... ఇప్పుడు తాము ఆ పని చేయలేమని చెప్పారు. సింగరేణి కార్మికులు సమ్మె చేయడం దురదృష్టకరమని అన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడితే సరిపోయేదని చెప్పారు. కోల్ బ్లాకుల వేలంపాటను ఆపి వాటిని సింగరేణికి అప్పగించాలని లోక్ సభ జీరో అవర్ లో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సమాధానంగా ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ వాస్తవాల ఆధారంగా లేదని అన్నారు.