కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో తుపాకీ మిస్ ఫైర్
- ట్రెజరీ వద్ద గార్డు విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు
- తుపాకీ పేలి ఛాతీలోకి దూసుకుపోయిన బుల్లెట్
- జిల్లా ఆసుపత్రికి తరలింపు
- ఘటనపై ఎస్పీ ఆగ్రహం
కాగా, తుపాకీ మిస్ ఫైర్ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణాలు తనకు తెలపాలని ఆదేశించారు. కాగా, తుపాకీని శుభ్రపరిచే క్రమంలో ట్రిగ్గర్ వద్ద చేయి తగలడంతో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసు అధికారులు తుపాకీని స్వాధీనం చేసుకుని, సీసీ టీవీ ఫుటేజి పరిశీలిస్తున్నారు.