కివీస్ తో రెండో టీ20లో టాస్ నెగ్గిన టీమిండియా

Team India won the toss
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. రాంచీ ఆతిథ్యమిస్తున్న ఈ పోరులో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 19, డారిల్ మిచెల్ 10 పరుగులతో ఆడుతున్నారు.

ఈ సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ లో రోహిత్ సేన నెగ్గిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించి సిరీస్ చేజిక్కించుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.
Go Back to Shorts
Team India
New Zealand
Toss
2nd T20
Ranchi

More Telugu News