నారా రోహిత్ కుమారుడి పేరు ఇదే.. అర్థం ఏంటంటే?
- కొడుకు పేరును ప్రకటించిన హీరో నారా రోహిత్
- 'నందన్ రామ నారా' అని నామకరణం చేసినట్టు వెల్లడి
- తాతయ్య గుర్తుగా పేరులో 'రామ'ను చేర్చినట్టు వివరణ
- జూన్‌లో రోహిత్, శిరీష దంపతులకు జన్మించిన బాబు
టాలీవుడ్ హీరో నారా రోహిత్ తన కుమారుడి పేరును అభిమానులతో పంచుకున్నారు. తనయుడికి 'నందన్ రామ నారా' అని నామకరణం చేసినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌లో నారా రోహిత్, శిరీష దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా నారా రోహిత్ తన పోస్ట్‌లో పేరు వెనుక ఉన్న అర్థాన్ని వివరించారు. 'నందన్' అంటే అనంతమైన ఆనందాన్ని ఇచ్చేవాడని, తన తాతయ్య జ్ఞాపకార్థం పేరులో 'రామ'ను చేర్చామని తెలిపారు. తన కొడుకును ప్రపంచానికి పరిచయం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ పేరు తమ కుటుంబ ప్రేమకు, మధుర జ్ఞాపకాలకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. "ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం.. మా చిట్టి నందన్" అంటూ రోహిత్ తన పోస్టులో రాసుకొచ్చారు.
నారా రోహిత్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ ప్రముఖులు రోహిత్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.