Kodali Nani: చంద్రబాబు, నారా లోకేశ్ లపై మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు

Kodali Nani challeges Nara Lokesh
  • జగన్ పై లోకేశ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు
  • లోకేశ్ ఒక పిల్ల పంది
  • చంద్రబాబు ఒక గుంట నక్క
చంద్రబాబు, నారా లోకేశ్ లపై మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను లోకేశ్ దున్నపోతు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. జగన్ ఇంటిని తాకుతానంటున్నాడని... నువ్వు చంద్రబాబు కొడుకువే అయితే వచ్చి జగన్ గుమ్మాన్ని తాకాలని సవాల్ విసిరారు. లోకేశ్ ఒక పిల్ల పంది అని అన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే కుక్కల్ని కొట్టినట్టు కొడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేశ్ అధికారంలోకి వస్తాడా? అని ఎద్దేవా చేశారు.

ఎయిడెడ్ స్కూళ్లను కబ్జా చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు అంటున్నారని... ఈ స్కూళ్లను జగన్ కి ఇస్తారా? లేక ప్రభుత్వానికి ఇస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక గుంటనక్క అని అన్నారు. కుప్పంలో టీడీపీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. అనంతపురం ఘటనలో టీడీపీ, వామపక్షాలకు చెందిన విద్యార్థి విభాగాలు ప్రవేశించడం వల్లే హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయని అన్నారు. పోలీసులపై రాళ్లు రువ్వారని, విద్యార్థులు గాయపడేటట్టు చేశారని చెప్పారు.
Kodali Nani
Jagan
YSRCP
Nara Lokesh
Chandrababu
Telugudesam

More Telugu News