దుకాణం ముందు బాలిక మృతదేహం కేసు.. తీవ్రంగా కొట్టి చంపేసినట్లు పోలీసుల నిర్ధారణ
- పంజాగుట్టలో ఇటీవల విగతజీవిగా కనపడ్డ నాలుగేళ్ల బాలిక
- మృతదేహాన్ని ఓ మహిళ వదిలి వెళ్లినట్లు గుర్తింపు
- నిందితుల గాలింపునకు 4 పోలీసు, 3 టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటు
ఆ బాలికను ఎవరో తీవ్రంగా కొట్టారని తేల్చారు. ఆమె కడుపులో ఎవరో బలంగా తన్నినట్లు చెప్పారు. ఆ బాలిక మృతదేహాన్ని దుకాణం ముందు ఓ మహిళ వదిలి వెళ్లిందని తెలిపారు. సీసీటీవీ కెమెరాలో నిందితులను గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని వివరించారు. నిందితుల కోసం నాలుగు పోలీసు, మూడు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.