మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి దశదిన కర్మకు హాజరైన సీఎం కేసీఆర్
- గత నెలలో శ్రీనివాస్ గౌడ్ కు మాతృవియోగం
- నేడు మహబూబ్ నగర్ లో దశదిన కర్మ
- శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన సీఎం కేసీఆర్
- శ్రీనివాస్ గౌడ్ తల్లి సమాధి వద్ద నివాళులు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ అక్టోబరులో గుండెపోటుతో మరణించారు. ఆమె అంత్యక్రియలు మహబూబ్ నగర్ లోని సొంత వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు.