ప్రభాస్ ను మెప్పించిన మారుతి?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ ను మెప్పించిన మారుతి?

Maruthi movies update
  • రీసెంట్ గా రిలీజైన 'మంచిరోజులు వచ్చాయి'
  • విడుదలకు రెడీ అవుతున్న 'పక్కా కమర్షియల్'
  • మెగాస్టార్ తో సినిమా ఉందన్న మారుతి
  • ప్రభాస్ తోను ఓకే అనిపించుకున్నాడనే టాక్  
మారుతి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మంచిరోజులు వచ్చాయి'కి పాజిటివ్ టాక్ వచ్చింది. దీపావళి కానుకగా ఈ నెల 4వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, మంచి వసూళ్లనే రాబడుతోంది. ఈ సినిమా తరువాత మారుతి నుంచి 'పక్కా కమర్షియల్' రానుంది. గోపీచంద్ హీరోగా .. రాశి ఖన్నా హీరోయిన్ గా ఈ సినిమా నిర్మితమైంది.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ .. తాను చిరంజీవికి ఒక లైన్ వినిపించాననీ, అది ఆయనకి బాగా నచ్చిందని చెప్పాడు. తన మార్క్ కామెడీతో ఈ కథ నడుస్తుందని అన్నాడు. ప్రస్తుతం పూర్తిస్థాయి స్క్రిప్ట్ పై కసరత్తు జరుగుతుందని అన్నాడు. బహుశా బాబీ సినిమా తరువాత మెగాస్టార్ చేసే సినిమా మారుతితోనే కావొచ్చు.

ఇక మారుతి చెప్పలేదుగానీ .. ఆయన ప్రభాస్ కి కూడా ఒక కథను చెప్పి ఒప్పించాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ఒకవేళ ఈ ప్రచారం నిజమే అయినా, ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి రెండేళ్లకి  పైగా పడుతుంది. ప్రస్తుతం ప్రభాస్ అంత బిజీగా ఉన్నాడు మరి.
Prabhas
Maruthi
Chiranjeevi

More Telugu News