బంగ్లాదేశ్ ను 73 పరుగులకు కుప్పకూల్చిన ఆసీస్... జంపాకు 5 వికెట్లు
- టీ20 వరల్డ్ కప్ లో నేడు ఆసీస్ వర్సెస్ బంగ్లాదేశ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
- 15 ఓవర్లలో ముగిసిన బంగ్లా ఇన్నింగ్స్
- సమష్టిగా సత్తా చాటిన ఆసీస్ బౌలర్లు
- చెరో రెండు వికెట్లు తీసిన స్టార్క్, హేజెల్ వుడ్
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో షమీమ్ హుస్సేన్ అత్యధికంగా 19 పరుగులు చేశాడు. ఓపెనర్ మహ్మద్ నయీం 17, కెప్టెన్ మహ్మదుల్లా 16 పరుగులు సాధించారు. ఆరంభ ఓవర్లలో స్టార్క్, హేజెల్ వుడ్ తమ పేస్ తో బంగ్లా బ్యాట్స్ మెన్ ను హడలెత్తించగా, ఆ తర్వాత జంపా తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా లోయరార్డర్ ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. దాంతో బంగ్లాదేశ్ జట్టు 15 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌట్ అయింది.