రేవంత్ కు రోజూ రాజకీయాలు కావాలి... అందుకే ఇలా మాట్లాడుతున్నాడు: పేర్ని నాని
- ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ పెట్టమంటున్నారన్న కేసీఆర్
- రెండు రాష్ట్రాలను కలిపేయాలన్న పేర్ని నాని
- తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ రేవంత్ వార్నింగ్
- కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని
రోజూ రాజకీయాల్లో ఉండాలనుకునేవారు ఇలాగే మాట్లాడతారని విమర్శించారు. రేవంత్ కు రోజూ రాజకీయాలు కావాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏమన్నారో, ఆ వ్యాఖ్యలపైనే తాను మాట్లాడానని పేర్ని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారని, ఇలా డొంకతిరుగుడు ఉండదని అన్నారు.
ఏ పార్టీ వారైనా డైరెక్ట్ గా మాట్లాడాలని, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు మాట్లాడకూడదని హితవు పలికారు. తెలంగాణలో ఒక తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయని, మళ్లీ కొత్త పార్టీ ఎందుకన్నదే తన అభిప్రాయమని మంత్రి పేర్ని నాని ఉద్ఘాటించారు.