స్పుత్నిక్ టీకాతో హెచ్ఐవీ ముప్పు ఎక్కువ.. దక్షిణాఫ్రికా సంచలన ప్రకటన
- రష్యా కరోనా వ్యాక్సిన్ కు అనుమతులివ్వలేమని వెల్లడి
- సరైన డేటా ఇస్తే పరిశీలిస్తామని కామెంట్
- టీకా వినియోగాన్ని రద్దు చేసిన నమీబియా
- ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతిచ్చేదాకా నిలుపుదల
దక్షిణాఫ్రికా ప్రకటనతో ఆఫ్రికా దేశమైన నమీబియా స్పుత్నిక్ వ్యాక్సిన్లను తాత్కాలికంగా నిలిపేసింది. ఇప్పటికే అక్కడ జనానికి స్పుత్నిక్ టీకాలు ఇస్తున్న ఆ దేశం.. మధ్యలోనే ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నమీబియా ఇవాళ ప్రకటన చేసింది. దక్షిణాఫ్రికా ప్రకటనను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చేంత వరకు స్పుత్నిక్ వ్యాక్సిన్ ను నిలిపేస్తున్నామని తేల్చి చెప్పింది.