Shahrukh Khan: కొడుకుపై బెంగ.. సరిగా తిండి కూడా తినని షారుఖ్ భార్య గౌరీ ఖాన్

Shahrukh Khan wife Gowri Khan not even having sufficient food
  • డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్
  • కొడుకు పరిస్థితి గురించి మనోవేదనకు గురవుతున్న షారుఖ్ దంపతులు
  • ఇంట్లో స్వీట్లు చేయవద్దని వంట సిబ్బందికి చెప్పిన గౌరీ
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి రాజభోగాలు అనుభవించిన ఆర్యన్.. జైల్లో నరకయాతన అనుభవిస్తున్నాడు. జైలు తిండి తినలేక అవస్థలు పడుతున్నాడు.

ఇదిలావుంటే, తమ కుమారుడి పరిస్థితి గురించి తెలుసుకుంటూ షారుఖ్, ఆయన భార్య గౌరి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా ఆర్యన్ ను బెయిల్ పై బయటకు తెచ్చేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై రేపు మరోసారి విచారణ జరగనుంది.

మరోవైపు ఆర్యన్ అరెస్ట్ అయినప్పటి నుంచి గౌరీ ఖాన్ సరిగా ఆహారం కూడా తీసుకోవడం లేదట. సరిగా నిద్రపోవడం కూడా లేదని చెపుతున్నారు. ఎక్కువ సమయం దైవ ప్రార్థనలతోనే గడుపుతోంది. ఆర్యన్ ఇంటికి వచ్చేంత వరకు ఇంట్లో స్వీట్లు వండద్దని వంట సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే, తమ ఇంటికి ఎవరూ రావొద్దని తన సన్నిహితులకు, బంధువులకు షారుఖ్ చెపుతున్నాడట.
Shahrukh Khan
Gowri Khan
Aryan Khan
Bollywood

More Telugu News