దక్షిణాదిన అత్యంత ప్రభావశీల నటుల్లో నెంబర్ వన్ గా రష్మిక, నెంబర్ టూలో విజయ్ దేవరకొండ
- సోషల్ మీడియా పాప్యులారిటీ ఆధారంగా జాబితా
- ఇన్ స్టాగ్రామ్ పోస్టులే ప్రాతిపదిక
- గత 25 పోస్టులకు వచ్చిన స్పందన మదింపు
- అల్లు అర్జున్ కు 5, ప్రభాస్ కు 8వ స్థానం
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ నటీనటులు ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టులు, వాటికి వచ్చిన ఆదరణను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించారు. ఆయా సినీ స్టార్లు ఇన్ స్టాగ్రామ్ లో చేసిన గత 25 పోస్టులను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ జాబితాల రూపకల్పనలో ఫోర్బ్స్ ఇండియా, సోషల్ సమోసా (సోషల్ మీడియా ఇండస్ట్రీ న్యూస్ అండ్ అనాలిసిస్ పోర్టల్), ఖోరజ్ (మార్కెటింగ్ టెక్నాలజీ సంస్థ) పాలుపంచుకున్నాయి.